‘దమ్ముంటే అయ్యన్నను తొలగించండి’

20 Jun, 2020 18:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్న పాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ సవాల్‌ చేశారు. నిర్భయచట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘మహిళా అధికారిణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్నపాత్రుడు దొరికారు. అలాంటి వ్యక్తిపై కేసు పెడితే వెనుకేసుకొస్తారా?

మహిళా ఉద్యోగులంటే టీడీపీకి చులకనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశారో?మహిళా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు’అని ప్రశ్నించారు. కాగా, విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
(చదవండి: కరోనా: ఆంధ్రప్రదేశ్‌లో 8 వేలు దాటిన కేసులు)

మరిన్ని వార్తలు