‘దుర్గ గుడి వ్యవహారాలన్నింటికీ ఆయనే కారణం’

11 Aug, 2018 16:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గ గుడిలో జరిగే వ్యవహారాలన్ని బుద్దా వెంకన్న కనుసన్నల్లోనే జరుగుతన్నాయి. అందుకే చీర మాయం అయిన వ్యవహారంపై పోలీసులు ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి దుర్గగుడిలో జరుగుతున్న చీరల మాయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

పాలకమండలి సభ్యుల వ్యవహారశైలి వివాదస్పదంగా ఉన్నా ప్రభుత్వ చర్యలు మాత్రం శూన్యమని విమర్శించారు. గతంలో తాంత్రిక పూజలు.. ఇప్పుడు చీరల మాయం అసలు ఇంతకు దుర్గ గుడిలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకు తెలయజేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంత్రి నారా లోకేష్‌ కోసమే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారు కాబట్టే అందుకు సంబంధించిన నివేదిక ఇంత వరకూ రాలేదని ఆరోపించారు.

యనమల జగన్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పు : మల్లాది విష్ణు
రాష్ట్రంలో కొన్ని పత్రికల రాతలు చూస్తూంటే అవి ఎవరి విజయం కోసం పనిచేస్తున్నాయో జనాలకు అర్థమవుతుంది. మరి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి లేఖలో ప్రస్తావించిన అంశాలకు యనమల రామకృష్ణుడు ఎందుకు సమాధానం చెప్పలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ కృషి చేస్తోంటే.. టీడీపీ మాత్రం నిస్సిగ్గుగా బీజేపీతో స్నేహం కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు సర్కారు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా