ఎంపీల దీక్షకు మద్దతుగా క్యాండిల్‌ ర్యాలీ

8 Apr, 2018 20:13 IST|Sakshi
ఏపీ భవన్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతల క్యాండిల్‌ ర్యాలీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధాన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పలు కార్యక్రమాలు జరగాయి. దీక్ష మూడో రోజైన ఆదివారం వైఎస్సార్‌సీపీ కీలక నేతలు, కార్యకర్తలు ఏపీ భవన్‌ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హోదా విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామన్నారు.

‘‘విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక నిర్ణయం జరిగిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రణాళికా సంఘానికి రిఫర్‌ చేసినా తొమ్మిది నెలలు కాలయాపన చేశారు. ఏపీకి హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం. కేవలం తన స్వార్ధప్రయోజనాల కోసమే చంద్రబాబు ఏపీకి చట్టబద్ధంగా రావాల్సిన హోదాను కాదని ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. కేంద్రం, రాష్ట్రాలు లాలూచీపడి ఏపీకి తీరని ద్రహం చేశాయి. ఆ రెండు పార్టీలకూ వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారు. మా పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తేనే రాజీనామాలు చేస్తాం గానీ టీడీపీ చెబితే చెయ్యం’’అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు