సంకల్పానికి సంఘీభావం

25 Sep, 2018 13:58 IST|Sakshi
గిద్దలూరులో వైవీ రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

కీలక ఘట్టానికి చేరువైన  ప్రజా సంకల్పయాత్ర

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు  జగన్‌కు వెల్లువెత్తిన మద్దతు

యాత్ర 3000 కి.మీ పూర్తయిన సందర్భంగా జిల్లాలో ర్యాలీలు

నేటి నుంచి మరో మూడు రోజులు పాదయాత్రలు

విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బాలినేని పిలుపు 

సాక్షి ప్రతినిధి,ఒంగోలు: క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు, పాదయాత్రలు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర సోమవారం 3000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా కేకులు కట్‌ చేసి, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. మహానేత వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంతోపాటు జిల్లాలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి తమ పార్టీకి మద్దతు పలకాలని  కోరారు.  

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 3వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా   వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు తన నివాసంలో పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్‌ కట్‌చేశారు. మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో  కేక్‌ కట్‌ చేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి పాల్గొన్నారు.  నియోజకవర్గ పరిధిలోని నాయుడుపల్లిలో ఎమ్మెల్యే జంకె  రావాలి జగన్‌... కావాలి జగన్‌ కార్య్రక్రమం నిర్వహించారు. 

అద్దంకి నియోజకవర్గం జే పంగులూరులో సమన్వయకర్త బాచిన చెంచు గరటయ్య ఆధ్వర్యంలో జగన్‌కు సంఘీభావ యాత్ర జరిగింది. బల్లికురవ మండలం కొండాయపాలెంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో నవరత్నాలపై గరటయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు.
గిద్దలూరు మండలంలోని గిద్దలూరు పట్టణంలో సమన్వయకర్త ఐవీరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వెయ్యి ద్విచక్రవాహనాలు, వంద ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి ఆధ్వర్యంలోనూ జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా నియోజకవర్గ వ్యాప్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.
పర్చూరులో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రావి రామనాధంబాబు ఆధ్వర్యంలో  కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచారు. 
కందుకూరు నియోజకవర్గ కేంద్రంలోని 3వ వార్డు, ఉప్పు చెరువు కాలనీ, కోవూరురోడ్, సాయినగర్‌లలో మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమం జరిగింది. నవరత్నాలపై ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేశారు.
సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో జగన్‌ పాదయాత్ర 100 రోజుల పైలాన్‌ వద్ద పార్టీ సమన్వయకర్త టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. సంతనూతలపాడులో నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు.
కనిగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు జగన్‌ పాదయాత్రకు సంఘీభావంగా కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో పార్టీ నేతలు వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచి పెట్టారు. 

మరిన్ని వార్తలు