సోమయాజులుకు ప్రముఖుల నివాళులు

20 May, 2018 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు.  సోమయాజులు మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాకాని గోవర్ధన్‌ రెడ్డి 
డీఏ సోమయాజులుతో తమకు విడతీయరాని అనుబంధం ఉందని కాంగ్రెస్‌ పార్టీ నేత కాకాని గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. రాజశేఖర్‌  రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు, ఇతర ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సహకరించిన వ్యక్తుల్లో సోమయాజులు ఒకరు అని కాకాని గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ వివరాలను క్షుణ్ణంగా విశ్లేసించగల గొప్ప ఆర్థికవేత్త అని అన్నారు. కుటుంబ సభ్యులకు గోవర్ధన్‌ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేశారు.

చిన్నికృష్ణ
సోమయాజులుతో తనకు ఉన్న అనుబంధాన్ని సినీ రచయత చిన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు. సోమయాజులుతో తనకు దాదాపు 10ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రజలకు ఉపయగపడే పలు అంశాల గురించి తెలుసుకోవడానికి రాజకీయవేత్తలు, అధికారులు వచ్చేవారని అన్నారు. ఆయన లేని లోటు ఆంధ్రరాష్ట్రానికి తీరనిలోటని అభిప్రాయపడ్డారు. దేశ, రాష్ట్రాలకు నిస్వార్థంగా సేవ చేసిన గొప్ప వ్యక్తి సోమయాజులు అని కొనియాడారు. తన స్క్రిప్ట్‌ పనుల్లో చాలా సహాయం చేశారని చిన్నికృష్ణ అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి
రాజశేఖర్‌ రెడ్డి హయాం నుంచి ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వరకూ సోమయాజులు పలు అంశాల్లో వారికి అండగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. ఏదైనా విషయం గురించి సమాచారం కావాల్సి వచ్చి ఆయన వద్దకు క్షణాల్లో నిమిశాలల్లో తయారుచేసి ఇచ్చేవారని తెలిపారు. ఆరోగ్యం సహకరిచంచకపోయినా బెడ్‌ మీద నుంచే తన కుమారుడికి డిక్టేట్‌ చేసి మరీ పంపించేవారని మేకపాటి గుర్తుచేసుకున్నారు. ప్రజలకు వైఎస్సార్‌ చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో సోమయాజులు అందించిన సహకారం ఎనలేనిదని అన్నారు. ఆయనను కోల్పోవడం తెలుగు ప్రజల దురదృష్టమని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు.

మరిన్ని వార్తలు