మాట తప్పిన పవన్‌ కల్యాణ్‌ : ఎమ్మెల్యే ఆర్కే

2 Sep, 2019 08:22 IST|Sakshi

మంగళగిరి నియోజకవర్గంలో  ఎందుకు పర్యటించారో? 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళగిరి రైతులకు ఇచి్చన మాట తప్పారని, అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకు ఆయన పర్యటించారో అర్థం కావటంలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాల గురించి ఒక్కమాట కూడా పవన్‌ మాట్లాడటం లేదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడికొండ పర్యటనలో పవన్‌ వెంట టీడీపీ క్యాడర్‌ నడిచిందన్నారు.

మంగళగిరి రూరల్‌ మండలం బేతపూడి గ్రామంలో గతంలో పర్యటించిన సమయంలో ఓ మహిళ పెట్టిన అన్నం తింటూ పవన్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. ‘అమ్మా.. చంద్రబాబు మీ భూములను బలవంతంగా లాగేసుకుంటున్నారు. భూములను  తీసుకోవడానికి చంద్రబాబు నోటిఫికేషన్‌ ఇస్తే రైతులకు అండగా నేను ఆమరణ దీక్ష చేస్తాను’ అని పవన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఐదారు నోటిఫికేషన్లు చంద్రబాబు ఇచ్చినా.. పవన్‌ అడ్రసేలేదన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రాజధాని ప్రాంతంలో పర్యటించారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ గెలుపు కోసం పవన్‌ తాపత్రాయపడ్డారన్నారు. 

చంద్రబాబు లేఖ ఆశ్చర్యకరం..
వరద నీటి గురించి సమాచారం ఎప్పటికప్పుడు మంత్రి అనిల్‌ కుమార్‌ ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేశారని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. అందుకే ఆస్తి నష్టాలు సంభవించలేదని తెలిపారు. వరద నియంత్రణలో ప్రభుత్వం విఫలం అయిందని చంద్రబాబు.. సీఎం జగన్‌కు లేఖ రాయటంపై ఆర్కే మండిపడ్డారు. చంద్రబాబు నివాసం ఆయనది కాదన్నారు. అది ప్రభుత్వ ఆస్తి, చట్టాలకు వ్యతిరేకంగా నిరి్మంచిన గృహమన్నారు. వరద వచ్చే ముందు అధికారులు అప్రమత్తం చేస్తే, కుటుంబసభ్యులతో కలసి చంద్రబాబు హైదరాబాద్‌కు పారిపోయారన్నారు. లోకేశ్‌ చేసే ట్వీట్లు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా