రాయపాటిని అస్త్రంగా చేసుకుని బాబు కుట్రలు..

17 Apr, 2020 18:04 IST|Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయపాటి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్‌ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ఎందుకు రద్దు చేయించారో చెప్పాలని బ్రహ్మనాయుడు డిమాండ్‌ చేశారు. నిస్వార్థంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై చంద్రబాబు కులముద్ర వేయిస్తున్నారని విమర్శించారు.

కమ్మ సామాజిక వర్గం ఉన్న జన్మభూమి కమిటీల వల్లే చంద్రబాబు 23 సీట్లుకు దిగజారారని ఆయన మండపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అది ఓర్వలేక  రాయపాటిని చంద్రబాబు అస్త్రంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన చరిత్ర రాయపాటిదని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హామీ ఇచ్చారు.


 

మరిన్ని వార్తలు