‘చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు’

6 Jun, 2020 21:32 IST|Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పదిమంది తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో మిగలరని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాము వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు అయినందుకు గర్వంగా ఉందని, కరోనా సమయంలోనూ ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఇక మారుమూలన ఉన్న తమ వినుకొండ నియోజకవర్గానికి ఇసుక రావడంలో ఆలస్యం అవుతుందని తాను చెప్పానని, అయితే దాన్ని ఎల్లో మీడియా భూతద్ధంలో చూపిస్తోందని ధ్వజమెత్తారు.
చదవండి: మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు