చంద్రబాబువి తోకపత్రిక ఆరోపణలు

24 Sep, 2019 10:10 IST|Sakshi
ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకనే మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తోకపత్రిక ఆరోపణలు చేస్తున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే డా. సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం కడపలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొంతమంది దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. పేపర్‌ ఎక్కడ లీకైందో, అందుకు గల కారణాలేంటో చెప్పకుండా ఫలితాలు వచ్చిన తర్వాత బుదరజల్లడం సరి కాదన్నారు. సచివాలయాల్లో 1.26లక్షల ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అధికంగా ఉద్యోగాలు వస్తాయని తట్టుకోలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 

పునరావాస స్థలం ఏర్పాటు చేయాలి 
కొండాపురం: గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి   వెంటనే పునరావాస స్థలం ఏర్పాటు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ గౌతమికి ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వాసితులు ఈ విషయంపై జేసీ గౌతమి, గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రత్యేక కలెక్టర్‌ సతీష్‌చంద్ర  చర్చించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ   పునరావాసస్థలం కేటాయిస్తే నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకుంటారని జేసీతో అన్నారు.    ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఎస్‌ .చిన్న అంకిరెడ్డి ,జిల్లా యూత్‌ ప్రదాన కార్యదర్శి ఆర్‌. హరినారాయణరెడ్డి, రైతులు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తప్పుడు ప్రచారంపై మండిపాటు
కడప కార్పొరేషన్‌: రాష్ట్రంలోని నాలుగు లక్షలకు టుంబాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టిం చారని వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహమతుల్లా అన్నా రు. సోమవారం వైఎస్‌ఆర్‌ఎస్‌యూ ఆధ్వర్యం లో  ర్యాలీ నిర్వహించి, నైట్రోజన్‌ బెలూన్లు ఎగురవేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ అ«ధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధారణమైన విషయం కాదన్నారు. ఎక్కడా ఒక్క తప్పు జరక్కుండా   పటిష్ట చర్యలు చేపట్టారన్నారు. ఇది ఓర్వలేని చంద్రబాబు, ఆయన తోకపత్రిక అసత్య కథనాలు రాస్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకా సురేష్, జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, డా. సొహైల్, కరిముల్లా, యూనుస్, దత్తసాయి, లోకేష్, ఆయుబ్, రహీమ్, జఫ్రుల్లా పాల్గొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ పాలన చారిత్రాత్మకం
కడప రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పరిపాలన చారిత్రాత్మకమని జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ గూడూరు రవి అన్నారు. సోమవారం స్ధానిక వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్ల పరిపానలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయిన సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. గడిచిన స్థానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగడాలకు అంతులేకుండా పోయిందని చెప్పారు. ఆయన స్ధానిక సంస్ధలను నిర్వీర్యం చేయడంతో పాటు సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ను రద్దు చేయడం దారుణమన్నారు. రాష్ట ఖజానా ఖాలీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారన్నారు. ఎలాంటి ఆదాయ వనరులు లేనప్పటికీ సంక్షేమ పాలన సాగించడం అభినందనీయమని అన్నారు. జనరంజక పాలనను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుడే పుట్టిన పిల్లాడు పరగెత్తలేడని అందరికీ తెలిసిందేనని, అయితే సీఎం వైఎస్‌ జగన్‌ 100 రోజుల పాలనలోనే సంక్షేమ రథన్ని పరుగులెత్తించడం ఆయనకు మాత్రమే సాధ్యమన్నారు.
- జెడ్పీ మాజీ ఛైర్మెన్‌ గూడూరు రవి

మరిన్ని వార్తలు