ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి: దేవినేని అవినాష్‌

10 Jan, 2020 12:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్టంలో 7 నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుభిక్షమైన పాలన అందించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని శ్రీనివాసనగర్‌ బ్యాంక్‌ కాలనీ వెల్ఫేర్‌ సోసైటీ వారు శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌, నగర అధ్యక్షుడు బొప్పన భవ కూమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ సోసైటీ అధ్యక్షుడు కోసరాజు వెంకటేశ్వరావు, సొసైటీ సభ్యులకు కండువా కంపి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తట్టుకుని సీఎం జగన్‌ ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. రాజధాని కట్టే స్థోమత ప్రస్తుతం మనకు లేదని, త్వరలో సీఎం జగన్‌ రాజధానిపై మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ప్రజల మనసులో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పాలన చెరగని ముద్ర వేస్తుందని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.

ఇక దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా తన తండ్రి దేవినేని నెహ్రూని నమ్ముకున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే నిలబడే వ్యక్తని, తనని సొంత తమ్ముడిలా చూస్తున్నారని అన్నారు. 2014లో తాను నష్టపోయినా ఇచ్చిన మాటకోసం నిలబడ్డానని, అమ్మఒడితో సీఎం జగన్‌ తల్లులకు అండగా నిలిచారన్నారు. 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్‌ ఉండాలని సామాన్య ప్రజానీకం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, మీ పిల్లల భవిష్యత్తుకు సీఎం జగన్‌ భరోసా ఇస్తున్నారని అన్నారు. ఇక చంద్రబాబు జోలి పట్టుకుని ఎందుకు భిక్షాటన చేశారోనని, ఇందుకు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని హితువు పలికారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు రాజకీయ లబ్థి పోందాలని చూస్తున్నారని అవినాష్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంచి చేసినా తట్టుకోలేకపోతున్న బాబు

కరోనా కన్నా చంద్రబాబు ప్రమాదకారి

ప్రజలకు అండగా ఎమ్మెల్యేలుంటే తప్పేంటి?

‘డాక్టర్లకు ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం’

బాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఇంతేనా?

సినిమా

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి

రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి