టీడీపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది: హఫీజ్ ఖాన్

3 Feb, 2020 12:39 IST|Sakshi

సాక్షి, కర్నూలు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రీబాగ్‌ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాజాధానిని తరలించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మండిపడ్డారు. సోమవారం కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 70 సంవత్సరాలుగా కర్నూలు తీవ్రంగా నష్టపోయిందన్నారు. వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకోని చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. టీడీపీ, శాసనమండలి సభ్యులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి.. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆయన మండిపడ్డారు.

కాగా కొందరు టీడీపీ నేతలు రాయలసీమను అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం చేశారని హఫీజ్‌ ఖాన్‌ అన్నారు. ఇందుకు అప్పటి మంత్రి అభిల ప్రియ నిదర్శనం అన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్‌ఆర్సీ బిట్లును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్రంలో ఈ బిల్లును అమలు చేయమని సీఎం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌ సీపీ అదనపు కార్యదర్శి తెర్నకల్లు సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్థన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు