‘అందుకే ప్రజల ముందుకు బాబు రాలేని పరిస్థితి..’

17 Dec, 2019 15:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లాలోని మూడు కాలేజీలను క్లస్టర్‌ యూనివర్శిటీలుగా అభివృద్ది చేస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పటం శుభపరిణామమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంగళవారం ఆయన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , మేరుగ నాగార్జునతో కలిసి మాట్లాడారు. సిల్వర్‌ జుబ్లీ డిగ్రీ కాలేజీలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వనున్నట్టు హఫీజ్‌ఖాన్‌ తెలిపారు.  

ఉపాధి హామీ పనుల్లో చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో రూ. 4200 కోట్ల ఉపాధి హామీ నిధులు స్వాహా చేశారని.. యంత్రాలతో పనులు చేసి భారీ అవకతవకలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఉపాధి హామీ పనులు జరగకుండా టీడీపీ ఎంపీలతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి చంద్రబాబు ఫిర్యాదు చేయించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. నీరు-చెట్టు పథకం పేరుతో బాబు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుంటే చంద్రబాబు సభలో లేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళిత, బీసీ వ్యతిరేకిగా బాబుపై ముద్ర పడిందని.. ఆయన దళితుల్ని ఎన్నోసార్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ నడుంబిగించారని చెప్పారు. తన డొల్లతనం బయట పడంతో చంద్రబాబు ప్రజల ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారని నాగార్జున ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు