ఇసుక.. టీడీపీ నేతల పొట్టల్లో ఉంది

29 Jul, 2019 11:57 IST|Sakshi

అది కక్కిస్తే.. కొరత తీరుతుంది

అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలోని ఇసుకను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ అసెంబ్లీలో మండిపడ్డారు. ప్రస్తుతం ఇసుక నదిలోనో, చెరువుల్లోనే లేదని, అది టీడీపీ నేతల పొట్టల్లో ఉందని, దానిని కక్కిస్తే.. ఇసుక కొరత తీరుతుందని అన్నారు. విచ్చలవిడి ఇసుక దోపిడీ కారణంగా గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ రూ. 100 కోట్ల పెనాల్టీ విధించిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వమే భవన కార్మికుల పొట్ట కొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇసుక కొరత కారణంగా భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ నేతలు సభ దృష్టికి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు అవలంబించిన ఇసుక దోపిడీ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని జోగీ రమేశ్‌ తెలిపారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..  రాష్ట్రంలో ఇసుక మాఫియా నుంచి ఇసుకను కాపాడేందుకు, చట్టబద్ధంగా సమగ్ర విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, భవన కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. త్వరగా ఈ విధానాన్ని తీసుకురానున్నామని తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్న విషయమే వాస్తవమేనని అన్నారు. కానీ ఆ కొరతకు కారణం గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు ఇసుక సంపాదనగా మార్చుకోవడమేనని తెలిపారు. సరైన సమగ్ర విధానంలో ఇసుక అమ్మకాలను క్రమబద్ధీకరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ఇసుక మైనింగ్‌ కోసం సమగ్ర, పారదర్శకమైన నియమనిబంధనలు ఖరారు చేయబోతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు