‘బీసీ అంటే బ్యాక్‌‌ బోన్‌ క్లాస్’‌

9 Jun, 2020 19:24 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: బీసీ అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తయారు చేశారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికులు పుస్తెలు తాకట్టు పెట్టుకుంటున్నారని ఈనాడులో తప్పుడు వార్త రాశారని మండిపడ్డారు. నేతన్నలకు భరోసాగా నేతన్న నేస్తం పధకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. లక్షల మందికి నేతన్న నేస్తం ద్వారా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఏడాదికి చేనేతలకు రూ. 24 వేలు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఎల్లో మీడియా, చంద్రబాబుకు చేనేతల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. చేనేతల పట్ల చిత్తశుద్ది ఉన్న వ్యక్తి , బీసీల పక్షపాతి సీఎం జగన్‌ అన్నారు. (సీఎం జగన్‌ పాలనపై ఛార్జిషీట్ వేయటం హాస్యాస్పదం)

ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ లేదని జోగి రమేష్‌ అన్నారు.  పది రోజుల్లోనే పింఛన్, రేషన్ కార్డు గ్రామ సచివాలయం ద్వారా ఇస్తున్నారని గుర్తు చేశారు. సీఎం జగన్ వలన బీసీలు తలెత్తుకొని దైర్యంగా తిరుగుతున్నారని తెలిపారు. ఏడాదిలో రూ. 42 వేల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేసిన  గొప్ప సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. జులై 8న 30 లక్షల మంది అక్క చెల్లెల్లకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. పేదలకు మేలు చేస్తుంటే చంద్రబాబు కడుపు మండిపోతుందన్నారు. విధ్వంసానికి ఒక చాన్స్ అనే పేరు తప్పు లేకుండా లోకేష్ పలకాలని సవాల్‌ విసిరారు. బలహీన వర్గాల అభినవ ఫూలే వైఎస్‌ జగన్‌ అని అభినందించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశం మొత్తం సీఎం వైఎస్‌ జగన్ వైపు చూస్తోందని తెలిపారు. (మళ్లీ కేజ్రీవాల్‌ వర్సెస్‌ ఎల్జీ)

మరిన్ని వార్తలు