చింతమనేనిని చూసి నేర్చుకోవాలా బాబూ!

20 Nov, 2019 13:17 IST|Sakshi

సాక్షి,పశ్చిమ గోదావరి: రౌడీ షీటర్‌ చింతమనేని చూసి నేర్చుకోండి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం తణుకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ 40 ఏళ్ల అనుభవం ఉందంటూ చెప్పుకునే చంద్రబాబుకు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5 నెలల పాలన చూసి మింగుడుపడటం లేదన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో వైఎస్సార్‌ సీపీకి ప్రజలు నీరాజనం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రౌడీయిజం పెచ్చు మీరిపోయిందని, ప్రజలకు 10 నెలలు ఇసుక ఇవ్వకుండా టీడీపీ నాయకులు దోచుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాలంటీర్లు తలుపు తడుతున్నారంటూ చంద్రబాబు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

నవరత్నాలు ప్రజల చేతుల్లోనే రాలుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుపై కేసులు ఉన్నా ఆయన స్టే తీసుకుని కాలం గడుపుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల మాదిరి వైఎస్సార్‌ సీపీకి రౌడీయిజం చేయడం రాదని అన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సీఎం జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిందని.. హత్య రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబే అని అన్నారు. ఇక బసవతారకం స్కూల్‌ పెట్టిన చంద్రబాబు అందులో ఎందుకు తెలుగు మీడియం ప్రవేశపెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పిల్లలను ఇంగ్లీషు మీడియంలో స్కూళ్లలోనే చదవిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు స్క్రిప్టును పవన్‌ చదువుతారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జేడీఎస్‌కు షాక్‌.. పోటీ విరమణ!

కమల్, రజనీ కామెంట్లతో కలకలం

గృహ నిర్మాణానికి రూ.1,869 కోట్ల సాయం

ఇక దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ

‘మహా’ ఉత్కంఠకు తెర!

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ యూనిట్‌ రద్దు

'అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వం'

పౌరసత్వం రద్దుపై స్పందించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ!

‘అక్రమ కేసులన్నీ ఎత్తేస్తాం’

శివసేనకు మద్దతుపై సోనియా గ్రీన్‌సిగ్నల్‌

మారిన బెర్త్‌.. ఇంత అవమానమా?

త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు

దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో..

శివసేనకు భారీ షాక్‌..

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తాం

మీరు 40 ఏళ్లలో ఇలాంటి పనులు చేశారా?

శరద్‌ పవార్‌కు బీజేపీ భారీ ఆఫర్‌!

దోచుకొని దాచుకున్న మీరా విమర్శించేది?

'పవన్‌.. వివాదాస్పద వాఖ్యలు మానుకో'

బీజేపీని పట్టి పీడిస్తున్న రెబెల్స్‌ బెడద

అవసరమైతే కలిసి పనిచేస్తాం

అబద్ధాలు, బుకాయింపులు బాబుకు అలవాటే

మమతపై ఒవైసీ ఫైర్‌

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి: భట్టి 

‘మహా’ ప్రభుత్వం ఇప్పట్లో లేనట్లేనా?

కార్మికులు గెలవడం పక్కా కానీ..

‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు ట్వీట్‌ చేశారు’

వారి పిల్లలే ఇంగ్లీష్‌ మీడియం చదవాలా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఇది నేను నిర్మిస్తున్న రెండో చిత్రం’

నిర్మాతలపై నయనతార బిగ్‌ బాంబ్‌!

తన అనారోగ్యంపై కృష్ణంరాజు క్లారిటీ

సూర్య నోట రాప్‌ పాట 

ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్‌

దటీజ్‌ పూరి జగన్నాథ్‌..