బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు: ఎమ్మెల్యే

21 Jan, 2020 19:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు కావల్సినంత సమయాన్ని ఇస్తున్నప్పటికీ వారు వినియోగించుకోలేక పోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. మండలిలో సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో వికేంద్రీకరణ బిల్లుని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రభుత్వ బిల్లులను సరైనా రీతిలో ప్రవేశపెట్టడం లేదని.. బిల్లుపై చర్చ పెట్టకుండ సాగదీయడం సరికాదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి అనేది చంద్రబాబుకు అక్కర్లేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆయన తెలిపారు.

సీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు

ఇక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పెద్దల సభలో చంద్రబాబు పెద్ద తప్పులు  చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు విధానం మారకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని ఆయన దుయ్యబట్టారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల తల్లులు ఆనందంగా ఉన్నారని, ప్రతి బిడ్డా చదువుకోవాలనేదే సీఎం జగన్ ఉద్దేశమని ఆయన తెలిపారు.

అలాగే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా విజయనగరం అని తెలిపారు. విద్యారంగంలో విజయనగరం ముందుకు వెళ్తుందని తాను ఆశిస్తున్నానట్లు పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, చంద్రబాబు ​ప్రభుత్వం విజయనగరం జిల్లాను చిన్న చూపు చూసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు మెడికల్ కాలేజిని ప్రకటించిన సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు