‘అది మీ తెలివి తక్కువతనం పవన్ కల్యాణ్‌’

13 Nov, 2019 14:46 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన.. తెలుగుదేశం పార్టీకి బినామి పార్టీగా మారిందని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలందరు సంతోషంగా ఉంటే రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత అయిదేళ్లలో టీడీపీ చేసిన అవినీతి పవన్ కల్యాణ్‌కు కనిపించలేదని, టీడీపీని రక్షించడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారే తప్ప కార్మికుల కోసం కాదని వ్యాఖ్యానించారు. రూ. 200 కోట్ల రూపాయిల కార్మికుల నిధిని స్వాహా చేసిన మంత్రిని పక్కన పెట్టుకున్న పవన్‌.. కార్మికుల కోసం లాంగ్ మార్చ్ అంటున్నారని ఎద్దేవా చేశారు.

‘ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకించే వ్యక్తులకు అసలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పడే అవస్థలు తెలుసా? పోటీ పరీక్షలకు తెలుగు విద్యార్థులు పడుతున్న అవస్థలు తెలుసా? కాయకష్టం చేసుకొనే కార్మికులు సైతం తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే తాపత్రయపడుతున్నారు. మూడేసి పెళ్ళిల్లు చేసు కోవాలని ప్రజలను ఉసిగొలుపుతున్నారా పవన్ కళ్యాణ్?.. జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చట్ట పరిధిలోకి లోబడి లేకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు సినిమాలో చెప్పినట్టు.. పులి పడుకుంది కదా అని పక్కన నుంచోని ఫోటో తీయడానికి ప్రయత్నించకండి. ఎన్ని చెప్పినా, ఏం అన్నా సీఎం వైఎస్‌ జగన్‌ ఊరుకుంటారులే అనుకుంటే అది మీ తెలివి తక్కువతనం పవన్ నాయుడు’ అని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నిప్పులు చెరిగారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు