‘టీడీపీ నేతలవి బురద రాజకీయాలు’

16 Sep, 2019 18:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి విషయంలో ప్రభుత్వంపై  టీడీపీ నేతలు విమర్శలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. విజయవాడలో సోమవారం జరిగిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు సిగ్గులేకుండా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, బుద్ది లేకుండా ప్రభుత్వ హత్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోడెల మరణానికి ఆయన కుటుంబ సభ్యులే కారణమని ఆయన బంధువులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలవి బురద రాజకీయాలని, ప్రభుత్వం కోడెలపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టలేదని అన్నారు. స్థానిక ప్రజలే ఆయనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, కోడెలను ప్రభుత్వం ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

అలాగే వైఎస్సార్‌సీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు కూడా టీడీపీ నేతల విమర్శలను ఖండించారు. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని అన్నారు. టీడీపీ సీనియర్‌ నేత మరణించాడనే బాధ కూడ నేతలకు లేదన్నారు. అయిన కోడెల మరణానికి కుటుంబ సభ్యలే కారణమని ఆయన మేనల్లుడు సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాక కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. టీడీపీ నేతలవి శవ రాజకీయాలని, విచారణలో అన్ని విషయాలు బయట పడతాయన్నారు. కోడెల మరణం బాధకరమని మంత్రి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా