‘చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉంది’

4 Sep, 2019 17:35 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వినాయకుడి పూజకు వెళ్లిన దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ నేతలు కులం పేరుతో దూషించడం దారుణమని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ నేతలు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కుల దూషణలో చంద్రబాబే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా దళితులపై దాడులే జరిగాయన్నారు. దళితులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చుట్టాలుగా మారుతున్నారని వారిపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో దళిత మహిళలను వివస్త్రను చేసి దాడులు చేశారన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని, ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదని నాగార్జున ఆరోపించారు.

(చదవండి : దళిత మహిళా ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం)

టీడీపీ యాంటీ దళిత పార్టీ : సుధాకర్‌ బాబు
రాజధాని ప్రాతంలో దళిత మహిళ ఎమ్మెల్యే శ్రీదేవిపై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు  తీవ్రంగా ఖండించారు. దళితులను అవమానించిన చంద్రబాబును ఆపార్టీ దళిత నేతలు నిలదీయకపోవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ యాంటీ దళిత పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డీఎన్‌ఏలోనే నాయకత్వ లోపం ఉందన్నారు.  టీడీపీ నేతలు చేస్తున్న పనులకు రాష్ట్రం సిగ్గుతో తలదించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిని సీఎం జగన్‌ బయటపెడుతుంటే తట్టుకోలేకనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కమల్‌నాథ్‌పై వ్యంగ్యాస్త్రాలు

‘పల్నాడు అరాచకాలపై చర్చకు సిద్ధం’

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం

ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించినవారిని అరెస్ట్ చేయాలి

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

పోలీసులపై అయ్యన్న పాత్రుడి చిందులు

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

పవన్‌ ఎందుకు ట్వీట్లు చేయడం లేదో: గడికోట

గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?

బర్త్‌డే రోజే అయ్యన్నకు సోదరుడు ఝలక్‌!

అయినా టీడీపీకి బుద్ది రాలేదు: ఎమ్మెల్యే ఎలిజా

'5శాతం' అంటే ఏమిటో మీకు తెలుసా?

‘అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడతాం’

జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్‌

కుటుంబ సమేతంగా సోనియాను కలిసిన రేవంత్‌

‘కేసీఆర్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు’

‘ఏపీ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారు’

‘కేసీఆర్‌, కేటీఆర్‌ అసమర్థులని ఆ ర్యాంకులే చెప్తున్నాయి’

వినాయకుడు మైలపడతాడని దూషించారు : ఎమ్మెల్యే శ్రీదేవి

బీజేపీ సర్కారు ఒప్పుకొని తీరాలి

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు భ్రమే!

‘ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డ చంద్రబాబు..’

పయ్యావుల వర్గీయుల రౌడీయిజం..

మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు

టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి

చిదంబరానికి స్వల్ప ఊరట

అక్కడికి వెళ్తే సీఎం పదవి కట్‌?!

గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటం చేయాలి

‘నాతో పెట్టుకుంటే విశాఖలో తిరగలేవ్‌..’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే