అ ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది

25 Jun, 2020 16:51 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, తాడేపల్లిగూడెం: కాపు సామాజికవర్గానికి అన్ని విధాలుగా చేయూత నిచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గురువారం స్థానిక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.4,770 కోట్లు అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కిందన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్‌‌ పథకం ద్వారా కాపు సామాజికవర్గానికి ఎంతో మేలు జరిగిందన్నారు. (అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి)

2014లో కాపులను బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబని విమర్శించారు. నాటి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ అనేక ఇబ్బందలకు గురిచేసిందన్నారు.  గత ప్రభుత్వ హయాంలో కాపులకు అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించలేకపోయాయని, అటువంటి పార్టీలు నేడు కాపు ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేయడం శోచనీయమన్నారు.  ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజికవర్గమని పేర్కొన్నారు. కాపు సామాజికవర్గానికి ఏడాది రూ.2 వేల కోట్లు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గుర్తుచేశారు. (‘కాపు’ కాసిన దేవుడు !)

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’  పథకాన్ని బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద బియ్యం కార్డు ఉన్న 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం, అదేవిధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లించనున్నారు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో ఈ నగదు జమకానుంది. 

మరిన్ని వార్తలు