కావలి ‘యువనేస్తం’ లో రసాభాస

2 Oct, 2018 19:10 IST|Sakshi

సాక్షి, కావలి : నెల్లూరు జిల్లా కావలిలో యువనేస్తం కార్యక్రమం రసాభాసగా సాగింది. కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. కార్యక్రమంలో ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ. వెయ్యి కోతపెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇంటో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డగించారు. టీడీపీ ఇచ్చిన హామీలను గుర్తుచేసినందుకుగాను ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వార్గాల మధ్య లోపులాట జరిగింది. పోలీసుల వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

యువనేస్తం కాదు యువ మోసం
చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి గందరగోళం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేగా అధికార కార్యక్రమంలో పాల్గొంటే రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రౌడీలకు, గుండాలకు భయపడేది లేదన్నారు. 

మరిన్ని వార్తలు