బాబు రైతులకు ఏం చేశారో చెప్పాలి: ఎమ్మెల్యే ఆర్కే

28 Nov, 2019 09:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్యాకేజీలతో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి, ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.  ఎమ్మెల్యే ఆర్కే గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ‘చేసిన వాగ్దానం ప్రకారం అమరావతిలో చంద్రబాబు చేత శంకుస్థాపన చేయబడి..నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగులు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి..చంద్రబాబు తన అమరావతి పర్యటన ప్రారంభించాలి. పేద రైతుల భూములు ఏవిధంగా తన మనుషులకు దోచిపెట్టారు. రాజధాని కోసం చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏమి చేశారో చెప్పాలి. రైతులకు అన్ని చెప్పాకే చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి.

చదవండిఅప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం

కౌలు రైతులు, చేతి వృత్తిదారులకు రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని చెప్పి ...తన పర్యటన కొనసాగించాలి. తన బినామీ కాంట్రాక్టర్లకు  ఏవిధంగా రైతుల భూములు దోచిపెట్టారో చెప్పి గ్రామాల్లో తిరగాలి. తన హయాంలో ఒక్కటి కూడా శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారో చెప్పి పర్యటించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాజధానిలో ఎక్కడ, ఏవిధంగా ఖర్చు పెట్టారో...ఎందుకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌లు ఇవ్వలేదో.. చెప్పి చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. 

చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం

భూములు ఇవ్వని రైతులపై ఎందుకు కేసులు పెట్టించి, పోలీసులతో హింసించారో చెప్పాలి. గ్రామ కంఠాలను తేల్చకుండా సామాన్యులను సైతం ఎందుకు ఇబ్బంది పెట్టారు. నిర్మాణ వ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500 అవుతుంటే.. ఇసుక, భూమి ఉచితంగా ఇచ్చి తన బినామీ కాంట్రాక్టర్లకు చదరపు అడుగు రూ.15,000లకు ఎందుకు ఇచ్చారో చెప్పి చంద్రబాబు పర్యటన చేయాలి. పేద, దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్‌ ప్రయివేట్‌ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కట్టబెట్టారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు

మరిన్ని వార్తలు