‘తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారు’

3 Mar, 2020 16:30 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : అధికారం పోవడంతో టీడీపీ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్‌,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. కల్లు తాగిన కోతుల్లా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమకు నచ్చిన బ్రాండ్స్‌ లేవని టీడీపీ నేతలు మాట్లాడడం సిగ్గు చేటని, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేతో శాసనసభలో మద్యం బ్రాండ్స్‌ గురించి మాట్లాడించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. మద్యం ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు టీడీపీ నేతలు భాధపడుతున్నారన్నారని ఎద్దేవాచేశారు.

టీడీపీ హాయాంలో ఒక్క బెల్ట్‌ షాపు అయినా తగ్గించారా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 20 శాతం షాపులను తగ్గించారని వివరించారు. బోండా ఉమ లిక్కర్‌ షాప్‌లో వర్కర్‌లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాలను లోకేష్‌ మద్యం దుకాణాలుగా మార్చారన్నారు. నారా వారు మద్యాన్ని ఏరులై పారించారన్నారు. మహిళల తాళి బొట్లు తెగేలా చంద్రబాబు మద్యం షాపులు పెంచారని మండిపడ్డారు. బీరును హెల్త్‌ డ్రింక్‌ అని గతంలో టీడీపీ నేత జవహర్‌ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.  

ఇక సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్‌ వ్యవస్థకు సెల్యూట్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేవలం ఒక రోజులోనే దాదాపు 60 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.  ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారుల మీద దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేశినేని నానిపై బుద్ద వెంకన్న బహిరంగంగానే దాడులు చేశరని, అంతేకాకుండా వనజాక్షి జుత్తు పట్టుకొని చింతమనేని కొట్టిన విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా గుర్తుచేశారు. 

చదవండి:
నెల రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలి
కరోనా అలర్ట్‌: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’

మరిన్ని వార్తలు