‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

13 Jun, 2019 14:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రైతులందరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పి, చేసిన తప్పు ఒప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా డిమాండ్‌ చేశారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులను మోసం చేసినందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రైతుల రుణాలు ఎగ్గొట్టి ఇప్పుడు సిగ్గు లేకుండా తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అయిదేళ్లలో రైతులకు ఇచ్చిన బాండ్లకు చంద్రబాబు డబ్బులు ఎందుకు చెల్లించలేదని రోజా సూటిగా ప్రశ్నించారు. 

చంద్రబాబు హామీలు ఇచ్చి...వాటిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయాలంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు తాను తప్పు చేసినట్లు అసెంబ్లీలో ఒప్పుకుంటే... ముఖ్యమంత్రి కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. అధికారంలోకి వచ్చి పదిరోజులు కాకముందే టీడీపీ నేతల కడుపు మంట బయటపడుతోందని రోజా అన్నారు. ఇక గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతకు మైక్‌ కూడా ఇవ్వకుండా అవమానించారని, అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తారని రోజా అన్నారు. ఏ అంశంపైన అయినా ముఖ్యమంత్రి సమాధానం ఇస్తామని ఆమె పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అఖిలపక్షానికి డుమ్మా.. దానికి వ్యతిరేకమేనా?

కర్ణాటక పీసీసీని రద్దు చేసిన కాంగ్రెస్‌

ఆయన ప్రపంచకప్‌ చూస్తూ బిజీగా ఉండొచ్చు..

‘కమిషన్ల కోసం పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు’

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి

‘గ్రహణం వీడింది; అందరి జీవితాల్లో వెలుగులు’

ప్రతిపక్షాన్ని హేళన చేసిన బీజేపీ ఎంపీలు

అఖిలపక్ష భేటీలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌

లోక్‌సభ స్పీకర్‌: ఎవరీ ఓం బిర్లా..

‘ఏయ్‌.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక

అఖిలపక్షానికి విపక్షాల డుమ్మా..!

ఆ ఇద్దరూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?

అన్నిచేసి.. ఇప్పుడేమో నంగనాచి డ్రామాలు

‘హ్యాపీ బర్త్‌డే రాహుల్‌’ : మోదీ

‘ప్రభుత్వాన్ని నడపడం గండంగా మారింది’

కోడెల వ్యవహారంపై టీడీపీ కీలక నిర్ణయం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిపై సస్పెన్షన్‌ వేటు

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

నాడు అరాచకం.. నేడు సామరస్యం

హోదాపై మాటల యుద్ధం

డిప్యూటీ స్పీకర్‌గా.. కోన రఘుపతి ఏకగ్రీవం

హోదా ఇవ్వాల్సిందే 

ఇది అందరి ప్రభుత్వం

‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

జూలైలో పుర ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రూ 200 కోట్ల క్లబ్‌లో భారత్‌

ఈ ఇడియట్‌ను చూడండి : సమంత

‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ పోస్ట్‌ ప్రొడ్యూసర్‌ మృతి

ప్రభాస్‌ నెక్ట్స్ ఎవరితో..?

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

‘సంపూ’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే!