‘లోకేష్‌ను కన్నందుకు బాబు బాధపడుతున్నాడు’

14 Oct, 2019 12:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాజశేఖర్‌ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు, లోకేష్‌ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించులేకపోయాడు. ఇలాంటి కొడుకు పుట్టినందుకు చం‍ద్రబాబు మథనపడుతున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చర్రితలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించబోతున్నారని తెలిపారు. రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. మాట తప్పారని ఆరోపించారు. జగన్‌ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల దెబ్బలకు చంద్రబాబు మైండ్‌ బ్లాంక్‌ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రజాదరణ కార్యక్రమం అయినా ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు సుధాకర్‌ బాబు.

చంద్రబాబు విద్యను అమ్ముకునే వాడిని విద్యాశాఖ మంత్రిగా చేస్తే.. జగన్‌ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు సుధాకర్‌ బాబు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందన్నారు. ఏనాడైతో మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయాడే.. నాటి నుంచే టీడీపీ కనుమరుగవడం ప్రారంభించిందన్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో  మిగిలిన వేలాది కోట్ల రూపాయలు చంద్రబాబుకు కనబడటం లేదా అని​ ప్రశ్నించారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన పాపాలను కడుక్కొడానికి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని ఆయన సూచించారు. కాకపోతే.. చంద్రబాబు గంగానదిలో  దిగితే అది కూడా కలుషితమవుతుందన్నారు సుధాకర్‌ బాబు.

జగన్‌ పాలన గురించి బుద్ధిలేని బుద్ధా వెంకన్న కూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. దుర్గ గుడిలో కొబ్బరి చిప్పల దొంగ బుద్ధా వెంకన్న.. రాయడం, చదవడం రాని వెంకన్న కూడా ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బుద్ధా వెంకన్నకు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం, కామెంట్‌ చేయడం వచ్చా అని​ ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉత్తరాలు, ట్వీట్లు మానుకొని ముందుకు రండి

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా

సిగ్గు అనిపించడం లేదా చంద్రబాబు?

పవన్‌ ‘కరోనా’ రాజకీయం సిగ్గుచేటు..

అందరికీ రేషన్‌ అందిస్తాం 

సినిమా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..