ఎమ్మెల్యే ఓటుకే ఎసరు

6 Mar, 2019 11:44 IST|Sakshi
ఎమ్మెల్యే డాక్టర్ సునీల్  కుమార్

సాక్షి, చిత్తూరు : రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు టీడీపీ ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. ఏకంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు ప్రయత్నించింది. తాజాగా వైఎస్సార్‌సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఓటుకు ఎసరు పెట్టింది. తన ఓటు తొలగింపునకు దరఖాస్తు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారని సునీల్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఉద్దేశపుర్వకంగానే వైఎస్సార్‌సీపీ నేతల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఫారమ్‌- 7 దరఖాస్తులు లక్షా పది వేలు దాటాయని వెల్లడించారు. మొన్న మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటు తొలగించగా, నేడు ఎమ్మెల్యే ఓటు తొలగించేందుకు దరఖాస్తులు వచ్చాయని వాపోయారు. చంద్రబాబు తన పచ‍్చ మీడియాతో తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. ఓట్లు తొలగింపు విషయంలో తన తప్పును కప్పి పుచ్చేందుకు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం చంద్రబాబు దొంగాట ఆడుతున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు