‘త్వరలోనే రాష్ట్రానికి 2100 మెట్రిక్‌ టన్నుల ఉల్లి’

10 Dec, 2019 20:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉల్లి సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు దేశ వ్యాప్తంగా ఉందని, కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లి మీద లొల్లి చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కిలో ఉల్లిని రూ. 25 సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఉల్లి ధర నిర్ణయించాల్సింది కేంద్రమేనని, ఆ మాత్రం విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని విమర్శించారు. ఉల్లి అక్రమ నిల్వలు చేస్తున్న వారిపై విజలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విప్‌ కోరుముట్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌12న 2100 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని దిగుబమతి చేస్తున్నామని, రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని, గుడివాడలో సాంబిరెడ్డి మరణాన్ని రాజకీయం చేయటం తగదని అన్నారు.

ఇక మరో విప్‌ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై చట్టం చేస్తుంటే టీడీపీ నేతలు గోల గోల చేస్తూ అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏమి మాట్లాడతరోనని భయపడిన టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారని విమర్శించారు. ఇకనైన చంద్రబాబు వైఖరి మారాలని, టీడీపీ పార్టీలో ఉంటే అవమానాలు పడాల్సీ వస్తుందేమోనని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా