చంద్రబాబును తక్షణం అరెస్టు చేయాలి..

13 Feb, 2020 23:21 IST|Sakshi

చంద్రబాబుపై పూర్తి విచారణ జరగాలి

కేంద్ర ఆర్థికశాఖ లాగింది తీగమాత్రమే.. కదలాల్సిన డొంక చాలా పెద్దది

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన

సాక్షి, అమరావతి : ‘కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన తర్వాత రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం దొంగలు తేలుకుట్టినట్టు నోరుపెగలకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ముఖ్యులు. చంద్రబాబు పీఎస్‌ ప్రస్తావన నేరుగా ఉన్న తర్వాత కూడా రోజుకు నాలుగు ప్రెస్‌మీట్లు పెట్టే మహానాయకుడు స్పందించలేదు. ఆయన పార్ట్‌నర్‌ కూడా స్పందించలేదు. నీతి, నిజాయితీల కోసం ఎర్రజెండా పట్టామన్న సీపీఐ రామకృష్ణకు కూడా ఈ తేలు ఎందుకు కుట్టిందో మాకు అర్థం కావడంలేదు. ఆయన నోరు ఎందుకు పెగల్లేదో ఆయనే సమాధానం చెప్పాలి. దీంతోపాటు ఎల్లోమీడియా పెద్దలు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిన రూ.2వేల కోట్ల అక్రమ, నల్లధన లావాదేవీల మీద ఎందుకో సిగ్గుపడ్డారు. ఆ ప్రెస్‌రిలీజ్‌లో మొట్టమొదటి వాక్యంలోనే అత్యుతన్న వ్యవస్థల్లో ఒకటైన సీబీడీటీ 2వేల కోట్ల రూపాయలకు పైగా నల్లధనం లావాదేవీలను గుర్తించాం అని పెద్ద అక్షరాల్లో చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలు ఢిల్లీ, పుణె సహా 40 చోట్ల సోదాలు నిర్వహించామని స్పష్టంచేశారు. ఈ రూ.2వేల కోట్లు ఎలా తరలించారో కూడా అందులో పేర్కొన్నారు’  ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఉండవల్లి శ్రీదేవి, రాజన్న దొర, హఫీజ్‌ ఖాన్ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు)

ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారా సబ్‌కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా చూపించి అసలు లేని మాయా కంపెనీలు, బోగస్‌ కంపెనీలు సృష్టించి మరీ ఈ వేల కోట్లను తరలించారని బయటపెట్టారు. ప్రాథమికంగానే రూ.2వేల కోట్లకుగా పైగా లెక్కాపత్రంలేని డబ్బు లావాదేవీలు జరిపనట్టు విచారణలో తేలిందని బయటపెట్టారు. వారిచ్చిన రిజిస్టర్డ్‌ అడ్రస్‌ల్లో కూడా తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని, ఇవి షెల్‌ కంపెనీలని, అంటే అందరికీ అర్థమ్యే భాషలో డొల్ల కంపెనీలని, బ్రీఫ్‌ కేస్‌ కంపెనీలని ఆ ప్రకటనల్లో స్పష్టంగా రాశారు. వీరి ఐటీఆర్‌ ఫైల్సింగ్‌ కూడా ప్రధాన కంపెనీలోని ఒక ఐపీ అడ్రస్‌నుంచి జరిగాయని చెప్పారు. బోగస్‌ బిల్లింగులు, అవకతవకలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్న  బోగస్‌ డాక్యుమెంట్లు ఇతర పత్రాలు, తమ సోదాల్లో దొరికాయని, ఇంతటితో ఆగిపోకుండా విదేశాలతో వీరు నిర్వహించిన లావాదేవీలకు సంబంధించిన లెక్కాపత్రం లేని డబ్బును తాము కనుగొన్నామని అందులో స్పష్టంచేశారు. వీటిని ఎఫ్‌డీఐల రూపంలో ప్రత్యేకించి కొన్ని గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు రూటింగ్‌ చేశారని వారి మాటల్లోనే చెప్పాలంటే రౌండ్‌ ట్రిప్పింగ్‌ చేశారని రాశారు. (చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో!)

ఇంత స్పష్టంగా వివరాలు బయటపెడితే... చంద్రబాబు మాట్లాడడు, లోకేష్‌మాట్లాడడు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడడు, వీరిని సమర్థించే ఎల్లోగ్యాంగ్‌ సభ్యులెవ్వరూ కూడా మాట్లాడరు. అంటే.. ఈరైడ్స్‌ అనేవి కేవలం ఒక పర్వతంలో ఒక వెంట్రుకంత మాత్రమే. చంద్రబాబు పర్సనల్‌ సెక్రటరీ, లోకేష్‌ అనుచరుడ్ని పట్టుకుని విచారిస్తేనే ఇంత భారీగా దొరికిందంటే.. ఇక చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతగా ఉందో.. మొత్తం దేశానికి అర్థం అవుతోంది. చంద్రబాబుపై పూర్తిస్థాయి దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, ఆర్వోసీ, ఐటీ, విదేశాంగ మంత్రిత్వశాఖ, రక్షణశాఖ మాత్రమే కాకుండా విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కూడా సంపూర్ణంగా సహకరించి విచారించాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇప్పుడు లాగింది కేవలం తీగ మాత్రమే. కదలాల్సిన డొంక చాలా పెద్దదే ఉంది.ఈవిషయాన్ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తోంది. ఆధారాలను ఎప్పటికప్పుడు ప్రజలముందు బయటపెట్టింది. ఇప్పుడిక చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్‌పై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించి ముందుగా ఆయన వ్యవస్థలను మేనేజ్‌ చేయకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భయంతోనే బీజేపీలో తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపాడని, పవన్‌కళ్యాణ్‌ను తనకు రక్షణగా వాడుకుంటున్నాడని అర్థమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టనర్‌లకు, చంద్రబాబులకు మధ్య గత ఐదేళ్లుగా తెరవెనుక జరిగిన లావాదేవీల మధ్య దృష్టిపెట్టాల్సి ఉంది’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు