చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన దరిద్రం: ఎమ్మెల్యే

27 Jan, 2020 11:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని మెజార్టీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఇచ్చారని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన క్యాబినేట్‌ సమావేశం శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవడ ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నకోబడిన ప్రభుత్వమన్నారు. మండలిలో పెట్టిన  బిల్లులన్నింటినీ ప్రతిపక్షం తిరస్కరించిందని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రమని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు మండలి రద్దవుతుందన్న బాధ కంటే ఆయన కుమారుడు లోకేష్‌కు ఉద్యోగం పోతుందనే బాధ ఎక్కువైందన్నారు. మండలి చైర్మన్‌కు విచక్షణ అధికారాలు ఉంటే... 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా విచక్షణ అధికారాలు ఉన్నాయన్నారు. ఇక మండలి రద్దును వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలుగా సీఎం జగన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ: ఈ రోజు శాసన మండలి రద్దుకు క్యాబినేట్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు పట్టడం లేదని, వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అడ్డుకోవడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లు అడ్డుకున్నారని, గిరిజనులు, దళితుల అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అదేవిధంగా ఆంగ్లభాషా బిల్లును కూడా అడ్డుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ: శాసన మండలి రద్దు నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా శాసన మండలిలో టీడీపీ వ్యవహరిస్తోందని, ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకుందని మండిపడ్డారు. కాగా పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 

మరిన్ని వార్తలు