‘దేశంలో ఫెల్యూర్‌ సీఎం చంద్రబాబు మాత్రమే’

23 May, 2018 15:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకుల సమావేశం కర్నూల్‌ జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం జరిగింది. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యయన్నారు. ‘ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీయస్‌ విధానాన్ని రద్దు చేసి పీఆర్సీ బకాయిలు చెలిస్తామని ప్రతిపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 99 శాతం మంది ఉద్యోగులు వైఎస్సార్‌సీపీ వెంటే ఉన్నారు.  ఉపాధ్యాయ రంగాలపై ప్రభుత్వం నిరంకుశంగా ఉంది. పీఆర్సీ కమిషన్‌ను కమిషనర్‌ లేకుండా వేయడం హాస్యాస్పదం.

ఇది చంద్రబాబు ఉద్యోగుల్ని మోసం చేయడమే. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమే. స్వార్థం కోసం ప్యాకేజీలను ఆహ్వానించిన ఘనుడు చంద్రబాబు. నాడు హోదా వద్దన్న చంద్రబాబు ప్యాకేజీల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి నేడు యూటర్న్‌ తీసుకుని హోదా కావాలని అనడం హాస్యాస్పదం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వల్ల ప్రజా ఉద్యమాలు అణచివేయబడ్డాయి. రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి  లాక్కోవడం దారుణం. రాజధాని ప్రాంతంలో భూ నిర్వాసితుల పరిస్థితి  అత్యంత దారుణంగా ఉంది. ఆరువందల అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సిగ్గులేకుండా ఇంకా అబద్దాలు అడుతున్నాడు.

శేఖర్‌ రెడ్డి వద్ద  దొరికిన 300 కోట్లలో 250 కోట్లు లోకేశ్‌వే. లోకేశ్‌ అవినీతిపై పవన్‌ కళ్యాణ్‌ విమర్శిస్తే చంద్రబాబు కనీసం ఖండించలేదు. అనునిత్యం నిప్పు.. నిప్పు అంటున్న చంద్రబాబు అవినీతి ఆరోపణలపై విచారణకు ఎందుకు సిద్ధంగా లేరు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు స్పష్టంగా ఉంటే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి కేయి కిృష్ణమూర్తి ఉత్సవ విగ్రహంలా మారారు.  ఎమ్మార్వోను బదిలీ చేసుకోలేని కేయి వల్ల జిల్లాకు వచ్చిన ప్రయోజనం శూన్యం. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు. ఓటుకు నోటు కేసులో ఇరుకున్న చంద్రబాబుపై దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయో అర్థం కావడంలేదు. తెలంగాణలో ఏకే ఖాన్‌ లాంటి నిజాయితీ గత అధికారి కూడా నోరు విప్పకపోవడంపై అనుమానాలున్నాయి. దేశంలో అత్యంత దారుణంగా విఫలమైన పరిపాలకుడు ఒక్క చంద్రబాబు మాత్రమే’  అని విమర్శించారు.

మరిన్ని వార్తలు