ఐటీశాఖ వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..

18 Feb, 2020 18:53 IST|Sakshi

సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతిని నిరూపించే సాక్షాలు కేంద్ర ఐటీ శాఖ వద్ద ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో 2వేల కోట్ల అవినీతి అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ నివేదికలు విడుదల చేసిందని, ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు రోజులుగా తీవ్ర రాజకీయ విమర్శలకు కారణమైన ఐటీ దాడులపై మహ్మద్ ఇక్బాల్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. అవినీతి సామ్రాజ్యానికి అధిపతి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో ఓటుకు నోటు కేసు పెండింగ్‌లో ఉందని.. ఆ కేసులో చంద్రబాబు ఎప్పటికయినా జైలు కెళ్లాల్సిందేనని ఇక్బాల్ జోస్యం చెప్పారు. గతంలోలాగా కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నా శిక్ష తప్పదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలతో కుమ్మకై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఆయన సమర్థవంతగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా తన తప్పులను ఒప్పుకోవాలని హితవుపలికారు. ప్రస్తుతం ఐటీ దాడుల్లో బయటపడిన అవినీతి సొమ్ము కేవలం నామమాత్రమే అని.. మున్ముందు లక్షల కోట్ల అవినీతి అనకొండ బయటపడుతుందని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు