వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు?: ఎంపీ సురేష్‌

24 Feb, 2020 11:33 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే అధికార పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ నందిగం సురేష్‌ వ్యాఖ్యానించారు.  రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్‌దే బాధ్యత అని గతంలోనే చెప్పానని, తనను అంతం చేయాలని చూస్తున‍్నారని ఎంపీ నందిగం సురేష్‌ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు మహిళలను ముందుపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై, ఆయన గన్‌మెన్, అనుచరులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఎంపీ నందిగం సురేష్‌ సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి)

బాబుది రక్తం రుచి చూసిన చరిత్ర
ఆయన మాట్లాడుతూ.. ‘జేఏసీ  ముసుగులో టీడీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు.  జేఏసీ పేరుతో తిరిగే వాళ్లకు కారం ప్యాకెట్లు ఎందుకు? లేళ్ల అప్పిరెడ్డి కారుపై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడికి సంబంధించిన వీడియో ఉంది. గన్‌మెన్లు, సిబ్బంది కళ్లల్లో మహిళలు కారం చల్లారు. అమరావతికి సంబంధం లేని వ్యక్తులు దాడులు చేస్తున్నారు. టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులే ఈ ఘటనకు పాల్పడ్డారు. కారం చల్లి నా గన్‌మెన్లు, సిబ్బందిపై దాడి చేశారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు అమరావతి ప్రజలు బలి అవుతున్నారు. చంద్రబాబుది రక్తం రుచి చూసిన చరిత్ర. దళితలు ఎప్పుడూ ఊరు బైట ఉండాలనుకొనే చరిత్ర ఆయనది. ఇప్పటికైనా చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా వాస్తవాలు రాయాలి. (ఐటీ గుప్పిట్లో బిగ్బాస్ గుట్టు!)

రాజధాని నీ అబ్బ సొత్తు కాదు
అరే ఎంపీ అంటూ ఏమి పీకుతారు అంటూ నోటి కొచ్చినట్లు తిట్టారు.. కళ్లలో కారం చల్లారు. గతంలో కూడా నాపై దాడి చేశారు. నా పీఎపై చెప్పుతో దాడి చేశారు. నా పక్కన ఉన్న వ్యక్తి కాలర్ పట్టుకొని కొట్టారు. మాపై దాడి చేసినవారు రాజధానికి సంబంధించిన వాళ్లు కాదు. నాపై దాడి చేసిన వారు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు. చంద్రబాబు చేతకాని రాజకీయాలు చేయొద్దు. రాజధాని మీ అబ్బ సొత్తు కాదు. అమరావతి చంద్రబాబు బినామిల రాజధాని. ఇప్పటికైనా ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి వాస్తవాలు రాయాలి. అలా తప్పుడు వార్తలు రాసి చంద్రబాబుకు 23 సీట్లు తెచ్చారు. ఆయనను ప్రజలు చెప్పుతో కొట్టినా సిగ్గు రాలేదు. తాను, తన సామాజిక వర్గం మాత్రమే రాజ్యాధికారం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తహసీల్దార్‌ వనజాక్షిపై మరోసారి టీడీపీ దాడి

నీచ రాజకీయాలు చేయొద్దు..
టీడీపీ మహిళలు ప్రయాణించిన బస్సులో ఎంపీ గల్లా జయదేవ్‌, ఆలపాటి రాజా ఉన్నారు. బస్సు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేలోగా అక్కడికి వాళ్లు ఎలా వచ్చారు? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని వెధవ రాజకీయాలు చేయొద్దు. మహిళలైతే ఏ ఇబ్బంది రాదని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. రాజధాని పేరుతో అక్రమాలకు అడ్డగా మార్చుకున్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారు. కారం మాపై వేసి, పైపెచ్చు వాళ్లే వేశారని చెప్పమంటున్నారు. బాబు తొత్తుగా మారిన ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని తెలిసి మాపై దాడులు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను అంతం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. నాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత. (ఆంధ్రా అనకొండ)

నీ అంతు చూస్తామంటూ బెదిరింపులు
దళితులకు ఎలాగు గౌరవం ఇవ్వరు. కనీసం ఎంపీ పదవికైనా గౌరవం ఇవ్వాలి కదా? దళితులు అమరావతిలో తిరగడానికి అర్హులు కాదా?  అమరావతిలో ప్రాణ భయంతో పారిపోయే పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి కూడా అర్థరాత్రి నాకు ఫోన్లు వస్తున్నాయి. నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు.  ఉప్పు, కారం తింటున్న మాకు రోషం ఉండదా?. సామాన్యులపైనా టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారు. మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. దాంతో మేము నిబద్ధతతో పని చేస్తున్నాం. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి పర్యటన సందర్భంగా పసుపు నీళ్లు చల్లించారు. ఇప్పుడు దళిత ఎంపీ అయిన నాపై దాడులు చేయించారు.’  అని మండిపడ్డారు. (దృష్టి మళ్లించడానికే దిక్కుమాలిన రాతలు..!)

మరిన్ని వార్తలు