పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?

25 Apr, 2019 15:15 IST|Sakshi

పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు: విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ఆయన ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ అజ్ఞానాన్ని మరోసారి ఎత్తిచూపించారు. ‘పప్పు మళ్లీ ఇరుక్కున్నాడు. దేశంలో 900 లోక్ సభ స్థానాలున్నాయంట. మంగళగిరిలో 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరినట్లే ఉంది. తండ్రేమో రష్యన్ హ్యాకర్లు ఈవీఎంల ఫలితాలను మారుస్తారని గోల చేస్తున్నారు. ఇద్దరూ  రాష్ట్రం పరువు మంట గలుపుతున్నారు. పప్పు, తుప్పులను గొలుసులతో కట్టేయాలేమో?’ అంటూ ఎద్దేవా చేశారు.

గతంలోనూ నారా లోకేష్‌ పలు సందర్భాల్లో పొంతనలేని మాటలతో దొరికిపోవడంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేశారు కూడా. భారతదేశంలో 900 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేస్తున్నారంటూ నారా లోకేష్‌ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ’6 వ తరగతిలో ఉన్నప్పుడు ప్రధాని పదవి తాత్కాలికం అని సలహా ఇచ్చిన ప్రపంచ మేధావి కూడా ఇతనే....’, ‘ఒరే నూ నాలుగు రోజులు మాట్లాడకుండా ఉండురా నాయనా 900ఎంపీ స్థానాలు ఎక్కడరా అయ్యా తెలుసుకొనన్నా మాట్లాడు’ అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో నారా లోకేశ్‌  ప్రతి రోజు ఏదో ఒక అంశంపై నోరుజారి పప్పులో కాలేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 29న మంగళగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మార్చి 23న కౌంటింగ్‌ పూర్తవగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో అక్కడున్న ఓటర్లంతా నవ్వుకున్నారు. అంతకుముందు ఏప్రిల్‌ 9న పోలింగ్‌ అని మాట జారారు. అలాగే మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేశ్‌ హాజరయ్యే బహిరంగ సభలు, రోడ్‌ షోలలో చేసిన ప్రసంగం ఆయన అధికార ఫేస్‌బుక్‌ పేజీలో లైవ్‌ వచ్చేది. అయితే గత నెల 28వ తేదీ నుంచి ఆయన లైవ్‌ ప్రసంగాన్ని కట్‌ చేశారు. విజ్ఞత మరచి ప్రసంగించడం.. ఆ వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తూ ఉండడంతో తెలుగుదేశం ఐటీ వింగ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపేసింది.

దేవుళ్ల ఆభరణాలకు చంద్రబాబు నుంచే ముప్పు
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచే దేవుళ్ల ఆభరణాలకు ముప్పు ఉందని, 1998లో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నగల చోరీ కేసులో ప్రకాశ్‌ సాహు అనే దొంగను పట్టుకొచ్చి ఇరికించారని విజయసాయి రెడ్డి అన్నారు. ఇప్పుడు తిరుపతి గోవిందరాజ స్వామి కిరీటాలు దొరికాయని కరిగించిన బంగారాన్ని చూపుతున్నారన్నారు. స్వామివారికి రాయలు సమర్పించిన అనేక వజ్రాభరాణాల ఆచూకీనే లేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు