‘ఆ విషయంలో చంద్రబాబు ప్లాన్‌ బెడిసికొట్టింది’

30 Jun, 2019 14:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ఘటనను వివాదాస్పదం చేసి సానుభూతి పొందాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన ముఠా వేసిన ఎత్తుగడ వేశారని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఆ విషయంలో చంద్రబాబు ప్లాన్‌ బెడిసికొట్టిందని వ్యాఖ్యానించారు. కేవలం రేకుల షెడ్డుకు రూ.9 కోట్లు ఎలా ఖర్చు అయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాజధాని వ్యవహారాల్లో ఇంకా ఎంత అవినీతి జరిగిందో అని ప్రజల్లో చర్చ మొదలయిందని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. 

యుద్ధం ఎప్పుడు చేయాలో సీఎం జగన్‌కు బాగా తెలుసు
చంద్రబాబునాయుడు కేసీఆర్ తో ఘర్షణ వైఖరిని అవలంభించినంత మాత్రాన‌  సీఎం జగన్ కూడా అదే పని చేయాలా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ఎప్పుడు యుద్ధం చేయాలో తమ సీఎంకు తెలుసునని అన్నారు. ‘ మీ అధినేత బీజేపీని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూటర్న్‌ తీసుకుని కాంగ్రెస్‌ గుంపులో చేరితో గొప్ప నిర్ణయం అనాలి. మీరు తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంభిస్తే మేమూ అలాగే ఉండాలా?, యుద్దం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో సీఎం వైఎస్‌ జగన్‌కు బాగా తెలుసు’  అని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు సమస్యే ప్రజాసమస్యా?
టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇస్తారనుకున్నాం కానీ ఆయన ఆయన అద్దె ఇంటికి నోటీసులు ఇవ్వడం, నారావారిపల్లెలోని భవనానికి కాపలా తగ్గిండంపై తీర్మానాలు చేయడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు సమస్యలే ప్రజా సమస్యలా అని ప్రశించారు.  మాజీ మంత్రి దేవినేని ఉమను విమర్శిస్తూ..‘ బహుదా-వంశధార-నాగావళి లింక్‌ పనులను ఐదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేక పోయారు ఉమా?, వనరుల దోపిడీకి తప్ప ఉత్తరాంధ్రను మీరు పట్టించుకున్నదెపుడు? ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,500 టిఎంసీల గోదావరి నీటితో ప్రతి ఎకరాకు జలాభిషేకం చేస్తారు సీఎం జగన్ ’  అని అన్నారు.

మరిన్ని వార్తలు