ఎంపీలకు బలవంతంగా ప్లూయిడ్స్‌

11 Apr, 2018 13:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిరాహార దీక్షలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను బలవంతంగా ఆస్పత్రికి తరలించినా.. వైద్యం చేయించుకునేందుకు నిరాకరించారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న మిథున్‌, అవినాష్‌ల ఆరోగ్యం విషమించడంతో వారిని బుధవారం రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో ఎంపీలకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు వైద్యులు ప్రయత్నించినా.. అందుకు వారు నిరాకరించారు. దీక్ష కొనసాగించాలన్న సంకల్పాన్ని ప్రదర్శించారు. దీంతో అక్కడ ఉన్న పార్టీ నేతలు, మీడియాను పోలీసులు బయటకు పంపించారు. దీంతో లోపల ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఎంపీలు మిథున్‌, అవినాష్‌ ఉన్నారు. దీక్షతో ఆరోగ్యం తీవ్రంగా విషమించిన కారణంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవాలని వైద్యులు ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా ప్లూయిడ్స్‌ ఎక్కించారు.
 

మరిన్ని వార్తలు