విభజన హామీలపై వైఎస్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం

8 Feb, 2018 09:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. విభజన హామీల అమలుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం నడుం బిగించిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు సమావేశం అయ్యారు. నాలుగేళ్లైనా విభజన చట్టం హామీలను కేంద్రం అమలు చేయక పోవడంపై పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద, పార్లమెంట్ లోపల నిరసన తెలపాలని కొనసాగించాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు నిర్ణయించుకున్నారు. నేడు సైతం ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, ఇతరత్రా అంశాలపై తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని ఉభయ సభల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు.

>
మరిన్ని వార్తలు