ఓటమి భయంతోనే కుట్రపూరిత దాడి: టీజేఆర్‌

27 Oct, 2018 14:41 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రపూరితంగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై దాడి చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌ బాబు విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌పై దాడి కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.

జగన్‌పై దాడి ఘటనలో ముఖ్యమంత్రి, డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. మాటల దాడి చేస్తూనే..రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా అందించడమే వైఎస్‌ జగన్‌ లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన అన్ని స్థాయిల్లో జరుగుతోందని, జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేతలు మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు.

వైఎస్‌ జగన్‌ శాంతి కాముకులు అని చెప్పారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ శివాజీని అరెస్ట్‌ చేసి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. సిగ్గులేని చేతకాని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. కుట్రలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. కుట్ర ఆధారిత రాజకీయాలనే బాబు నమ్ముకున్నారని అన్నారు. జగన్‌పై దాడిని కేంద్రస్థాయి సంస్థతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

గరుడ ప్లానంతా చంద్రబాబుదే: గోపిరెడ్డి
గుంటూరు: ఓటమి భయంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బరితెగించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేతపైనే హత్యాయత్నానికి ఉసిగొల్పారని అన్నారు. ఆపరేషన్ గరుడ ప్లానంతా చంద్రబాబుదేనని ఇప్పుడు స్పష్టం అవుతోందని వెల్లడించారు. శివాజీని అరెస్టు చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రలు క్షీణించాయని, ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే హత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఒక టీడీపీ నేతలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

మరిన్ని వార్తలు