సంస్కారహీనంగా మాట్లాడితే సహించం..

31 Dec, 2019 12:39 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి ఎన్‌.పద్మజ

సాక్షి, తాడేపల్లి: రాజధానిలో ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి ఎన్‌.పద్మజ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కుల రాజకీయాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తెర లేపుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధానికి చంద్రబాబు అనుకులమో? వ్యతిరేకమో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు మెప్పు కోసమే సుంకర పద్మ సంస్కారహీనంగా మాట్లాడుతుందని నిప్పులు చెరిగారు. సుంకర పద్మ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు విపరీతంగా జరిగాయన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. రాజధాని భూ కుంభకోణంలో లోకేష్‌, సుజానాచౌదరికి బినామీ పేర్లతో భూములు లేవా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగితే.. ఈ వంకర పద్మశ్రీ ఎక్కడ ఉందని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓ వైపు సూక్తులు.. మరోవైపు రాజకీయాలు : అంబటి

కన్నీటిపర్యంతం.. రాజీనామా చేయండి!

సీఎం జగన్‌ చేతల మనిషి, ప్రచారానికి దూరం..

జరగని విందుకు.. మేము ఎలా వెళ్తాం?

ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ

సినిమా

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు

ఇంట్లో ఉండండి

కుశలమా? నీకు కుశలమేనా?

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా