‘అందుకే టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు’

19 Mar, 2019 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే స్థాయి మరచి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీని నేరగాళ్ల పార్టీ అంటున్న చంద్రబాబు.. తమ అభ్యర్థుల జాబితాలో ఎంతమంది నేరస్తులు ఉన్నారో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ‘ చంద్రబాబు నువ్వు నేరగాడివి. నువ్వు, నీ కొడుకు కలిసి 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. మీ అభ్యర్థి చింతమనేని పుణ్య పురుషుడా. ఇక నిడదవోలు ఎమ్మెల్యే 400 కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా అమ్ముకున్నాడు. బోండా ఉమా కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఉన్నాడు. నారాయణ కాలేజీలో ఎంత మంది చనిపోయారు. దానిపై చర్చ ఎందుకు జరగడం లేదు’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

అభ్యర్థులు కూడా దొరకడం లేదు..
కోట్లు కుమ్మరించి అడ్డదారిలో టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. ప్రశాంత్‌ కిషోర్‌ను బిహార్‌ గ్యాంగ్‌ అనడం దారుణం. సీఎం స్థానానికి చంద్రబాబు అనర్హుడు. ఆయనకు ఓటమి తప్పదని అర్థం అయ్యింది. అందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పక్కన ఎవరున్నా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. చంద్రబాబు మానసిక స్థితి చూసి వాళ్ల పార్టీ అభ్యర్థులు పోటీకి దూరంగా ఉంటున్నారు’ అని చంద్రబాబు తీరును ఎండగట్టారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌