23 నుంచి 30 వరకు వైఎస్సార్‌సీపీ సేవా కార్యక్రమాలు

21 May, 2020 05:00 IST|Sakshi

విస్తృతంగా సేవా, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు పిలుపు

కరోనా నిబంధనలు విధిగా పాటించాలి

పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు 

సాక్షి, అమరావతి: 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలుపొంది ఈ నెల 23వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తవుతున్న సంద ర్భంగా ఆ రోజు నుంచి.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 30 వరకు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది.  పథకాల అమలుపై ప్రచారాన్ని నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం పార్టీ శ్రేణులకు సర్క్యులర్‌ జారీచేశారు. పార్లమెంట్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాలు జరిగేలా చూడాలని కోరారు.

► కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేప్పుడు విధిగా నిబంధనల మేరకు వ్యవహరించాలి. 
► ప్రజల ఆశలు–ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా సీఎం జగన్‌ సమూల మార్పులు తెచ్చారు. 
► మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చారు. 
► ముందుగా ప్రకటిం చని 40 కొత్త పథకాలను కూడా అమలు చేస్తూ.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా, మంచి మనసున్న పాలకుడిగా వైఎస్‌ జగన్‌ మన్ననలు పొందారు. 
► 23వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం తో పాటు.. మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరేయాలి.
► పేదలకు పండ్ల పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టాలి.
► ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు సేకరించాలి,అక్కడ ఎమ్మెల్యేలు సొంతంగా సాధించిన ప్రగతిపై కరపత్రాలు, వీడియోలు, ప్రకటనల రూపంలో ప్రచారం చేయాలి.
► ఏడాది పాలన, ప్రగతి పథకాలపై ఇప్పటికే ప్రభుత్వం వారం రోజుల (23 నుంచి 30 వరకు) కార్యకలాపాలకు రూపకల్పన చేసింది.. దానికి అనుగుణంగా పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహించాలి. 

కరోనా కంటే డేంజర్‌ ఎల్లో వైరస్‌
కరోనా వైరస్‌ కంటే అత్యంత ప్రమాదకరమైనది ఎల్లో వైరస్‌ అని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ మంచి పని చేపట్టినా విమర్శించడమే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారని అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా డుతూ ఆయన ఏమన్నారంటే..
► ఆర్థికంగా బాగా చితికిపోయిన రాష్ట్రానికి ఇది గడ్డు కాలం, పరీక్షా సమయం. సంక్షో భాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ కరోనాను నియంత్రించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ అన్నివిధాలా కృషి చేస్తున్నారు.
► కరోనా టెస్ట్‌లు చేసే సామర్థ్యాన్ని పెంచుకుని.. వృద్ధులు, ఇతరత్రా వ్యాధులు ఉన్న వారికి వైరస్‌ సోకకుండా చాలా వరకు నిరోధించగలిగాం.
► ఇలాంటి సంక్షోభంలోనే విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయితే ప్రభుత్వం ఎలా స్పందించిందనేది అందరికీ తెలుసు.
► ఇలాంటి పరిస్థితుల్లో కరోనా రావడమే పెద్ద అవకాశం అన్నట్టుగా చంద్రబాబు, దిగజారుడు విమర్శలు చేస్తున్నారు.
► వీళ్ల తీరు చూస్తూంటే కరోనా వైరస్‌ కంటే డేంజర్‌ ఎల్లో వైరస్‌ అనేది తెలిసిపో తోంది. అది ప్రజల మెదళ్లను విషపూ రితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 
► కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను కేంద్రం ప్రశంసిస్తోంది. చంద్రబాబుకు ఇవేమీ పట్టవు.

మరిన్ని వార్తలు