ప్యాకేజీ రాష్ట్రానికి కాదు.. చంద్రబాబుకు : వైవీ సుబ్బారెడ్డి

9 Feb, 2018 13:11 IST|Sakshi
వైవీ సుబ్బారెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో బయటపడటానికే చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైన వెనకాడబోయేది లేదని ఆయన స్పష్టం చేశారు.

విభజన చట్టంలోని ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వైవీ అన్నారు. విశాఖ రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగ్గరాజపట్నం పోర్టు సాధించే వరకూ తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో జరుగుతున్న అవినీతి, అనుచరుల దోపిడీల గురించి ప్రజలకు తెలియచేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాముఖ్యత, దాని ఆవశ్యతను వివరిస్తూ, విభజన హామీలు అమలుకు పాదయాత్రల ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు.

జైట్లీ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని మండిప్డడారు. హోదా బదులు రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక పాకేజీకి సైతం చట్టబద్దత లేదని విమర్శించారు. ఇంకా ఎంతకాలం చంద్రబాబు ప్రజలను మభ్యపెడతారంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ రాష్ట్రానికి కాదని, చంద్రబాబుకు ప్యాకేజీ అని, దోచుకోవడానికే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని వైవీ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు