దేవినేని అరాచకాలు సాగనివ్వం: వైవీ

14 Aug, 2018 20:18 IST|Sakshi

కృష్ణా జిల్లా:  మైలవరం నియోజకవర్గంలో ఏపీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అరాచకాలను సాగనివ్వబోమని ఒంగోలు మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మైలవరంలో వైవీ విలేకరులతో మాట్లాడుతూ..ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను మంత్రి ఉమ గాలికి వదిలేశారని విమర్శించారు.  ముఖ్యమంత్రి భజన కార్యక్రమాలకే దేవినేని పరిమితమయ్యారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకే మైలవరానికి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ని తీసుకురావడం జరిగిందన్నారు. మంత్రి ఉమాకి ప్రజలు త్వరలోనే ఓటమి రుచి చూపించడం ఖాయమన్నారు.

250 మంది టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
అంతకు ముందు కొండపల్లి గ్రామంలో వైవీ సుబ్బా రెడ్డి వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వరకు బైక్‌ ర్యాలీ తీశారు. ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వెంకటేశ్వరరావు కల్యాణ మండపంలో మైలవరం నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. టీడీపీ నుంచి సుమారు 250 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు.  చేరిన వారిలో కొండపల్లి మాజీ సర్పంచ్‌ గురవయ్య, చండ్రగూడెం మాజీ సర్పంచ్‌ దేవరకొండ ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్‌ శీలం అనిమి రెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు వేమిరెడ్డి సంజీవ రెడ్డిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు