-

ముగిసిన తొలివిడత నామినేషన్లు

25 Apr, 2019 11:11 IST|Sakshi
ఇందల్వాయి జెడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ వేస్తున్న జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం సుమన, పక్కన ఎమ్మెల్యే బాజిరెడ్డి తదితరులు

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పక్రియ బుధవారంతో ముగిసింది. చివరి రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. ఒక్కరోజే ఎనిమిది మండ లా ల్లో జెడ్పీటీసీ స్థానాలకు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్‌ మండలంలో  5 , ధర్పల్లిలో 14, డిచ్‌పల్లిలో 3, ఇందల్‌వాయిలో 10, మాక్లూర్‌లో 4, మోపాల్‌లో 4, సిరి కొండలో 5, నవీపేటలో 7 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి మొత్తం 60 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో పార్టీల వారీగా పరిశీలిస్తే బీజేపీ నుంచి 16 మంది అభ్యర్థులు, కాంగ్రెస్‌ నుంచి 15, టీఆర్‌ఎస్‌ నుంచి 21, స్వతంత్రులు 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  
ఎంపీటీసీ స్థానాలకు.. 
ఎంపీటీసీ స్థానాలకు చివరి రోజు 448 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో నిజామాబాద్‌ మండలంలో 27, ధర్పల్లి మండలంలో 50, డిచ్‌పల్లిలో 60, ఇందల్‌వాయిలో 75, మాక్లూర్‌లో 49, మోపాల్‌లో 62, సిరికొండలో 42, నవీపేటలో 83 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ ల వారీగా పరిశీలిస్తే బీజేపీ తరపున 105 మంది అభ్యర్థులు, కాంగ్రెస్‌ నుంచి 96, టీఆర్‌ఎస్‌ నుంచి 191, స్వతం త్రులు 121, సీపీఐ తరపున ఒక్కరు, ఎంఐఎం తరపున ఒక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి మొత్తం మొత్తం 515 నామినేషన్లు దాఖ లయ్యాయి.  మొదటి విడత 
ఎన్నికలు జరిగే 8 మండలాల్లోని 8 జెడ్పీటీసీ స్థానాలకు 60 నామినేషన్లు,  100 ఎంపీటీసీ స్థానాలకు 515 నామినేషన్లు దాఖ లయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 27న అభ్యంతరాల స్వీకరణ, 28న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 6న పోలింగ్‌ జరుగనుంది.

మరిన్ని వార్తలు