పత్తికొండ టీడీపీలో రాజీనామా కలకలం

14 Feb, 2019 10:48 IST|Sakshi

పత్తికొండ, కర్నూలు: పత్తికొండ టీడీపీలో రాజీనామా కలకలం రేగింది. టీడీపీకి, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు వరలక్ష్మి సిద్ధం కావడంతో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధిగా తనను డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి గుర్తించకపోవడం మన్తస్తాపం చెందిన వరలక్ష్మి టీడీపీకి గుడ్‌ బై చెప్పాలనే యోచనలో ఉన్నారు.

ఈరోజు(గురువారం) తన అనుచరులతో జెడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. బీసీ ఓట్లతో గెలిచి కేఈ కృష్ణమూర్తి ఒక బీసీ మహిళపట్ల వివక్ష చూపతున్నారని వరలక్ష్మి కలత చెందినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వరలక్ష్మి భర్త నాగేంద్రకు-కేఈ కుటుంబాలకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ వరలక్ష్మి భర్త నాగేంద్ర శాలివాహన చైర్మన్‌గా ఉండటం గమనార్హం. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా