పారుతున్నది కాలువ కాదు... సాగర్‌ నీరు

5 Mar, 2019 12:33 IST|Sakshi
తోకపల్లె దగ్గరలో ఎయిర్‌వాల్‌ లీకుతో వృథాగా పోతున్న సాగర్‌ నీరు

సాక్షి, తోకపల్లె (పెద్దారవీడు): మండలంలో తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే ఉన్న సాగర్‌ ఎయిర్‌వాల్‌ లీకుతో నీరంతా వృథాగా పోతుంది. ఆర్‌డబ్ల్యూఎస్‌ మంచినీటి పథకం ద్వారా త్రిపురాంతకం మండలం దుపాడు చెరువు నుంచి తోకపల్లె, గొబ్బూరు, దేవరాజుగట్టు మీదుగా పెద్దసైజు నీటి పైపుల ద్వారా మార్కాపురం పట్టణానికి నీరు సరఫరా చేస్తున్నారు. అమరావతి– అనంతపురం జాతీయ రహదారిలోని తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి వద్ద పైపు ఎయిర్‌ వాల్‌ లీక్‌ కావడంతో పొలాల మీదుగా సాగర్‌ నీరంతా వృథాగా తీగలేరు కాలువలోకి వెళ్తున్నాయి.

వేసవి కోసం పొదుపుగా నీటిని వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎయిర్‌వాల్‌ లీకేజితో నీరంతా రోజూ కొన్ని వేల లీటర్ల నీరు నేలపావుతోంది. ఎయిర్‌వాల్‌ లీకేజి గురించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వదిలిన సమయంలో తీగలేరులోకి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అసలే వేసవి కాలంలో ప్రజలు, పశువులు తాగునీటితో అల్లాడిపోతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు