టీడీపీ నేతలు భూమి కబ్జా చేశారు

6 Mar, 2018 08:58 IST|Sakshi

ఒంగోలు వన్‌టౌన్‌ : ‘నాలుగు ఎకరాల మా సొంత భూమిని రెండు సంవత్సరాల నుంచి స్థానిక టీడీపీ నేతలు ఆక్రమణలో ఉంచుకున్నారు. అక్రమంగా మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. అడ్డగించిన నన్ను, నా భర్త వెంకటప్రసాద్‌పై నార్నె వెంకటేశ్వర్లు, అడుసుమల్లి శ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు కత్తులతో దాడికి తెగబడ్డారు. మమ్మల్ని ప్రభుత్వ అధికారులు గానీ, నాయకులు గానీ పట్టించుకోవడం లేదు’ అని బోడెంపూడి శోభారాణి వైఎస్‌ జగన్‌ వద్ద చెప్పుకుంది.

కూలి రూ. 150 లే అన్నా..
అద్దంకి వన్‌టౌన్‌: అద్దంకి మండలం అలవలపాడు గ్రామానికి చెందిన ఇటుక బట్టీల మహిళా కూలీలు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. తాము దర్శి, గంగవరం, కుంకుట్లపల్లి, బల్లికురవ కాకినాడల నుంచి వలస వచ్చి అలవలపాడు ఇటుక బట్టీల వద్ద కూలీ పని చేసుకుంటున్నామని తెలిపారు. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉండే ఇటుక బట్టీల పనిలో రోజుకు రూ. 150 కూలి మాత్రమే వస్తుందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఇటుక బట్టీలు కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు.

>
మరిన్ని వార్తలు