స్పీడ్‌బాల్‌ అండర్‌–19 రాష్ట్ర జట్ల  ఎంపిక

11 Jan, 2018 11:28 IST|Sakshi

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 స్పీడ్‌బాల్‌ రాష్ట్ర బాలబాలికల జట్ల ఎంపికలను బుధవారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్‌జిల్లాల పోటీల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి పాటూరు వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయపోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గుంటూరు ఆర్జేడీ వై.పరం«ధామయ్య, డీవీఈఓ బీమా వెంకయ్య, ఆర్‌ఐఓ బాబూజాకబ్, రాష్ట్ర పరిశీలకులు పుల్లయ్య, స్పీడ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వార్తలు