ఓటర్లపై ఎస్‌ఐ జులుం

12 Apr, 2019 13:10 IST|Sakshi
సోమలలో ఎస్‌ఐ లాఠీ ఝుళిపించడంతో గాయపడిన తిమ్మిలమ్మ, యువకులు

కానిస్టేబుల్‌పై దేశం నేతల దౌర్జన్యం 

లాఠీతో చితకబాదారు 

సోమలలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పరామర్శ

పుంగనూరు: ఓటు వేసేందుకు వచ్చిన దళిత మహిళలపై ఎస్‌ఐ జులుం ప్రదర్శించి, ఓటర్లను చితకబాదిన సంఘటన సోమల పోలింగ్‌ కేంద్రంలో చోటుచేసుకుంది. అలాగే విధి నిర్వహణలో కానిస్టేబుల్‌పై ఉన్న దౌర్జన్యం చేసి, అతని సెల్‌ను లాక్కుని పగులగొట్టిన సంఘటన వనమలదిన్నెలో జరిగింది. గురువారం ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. సోమలలోని 149 పోలింగ్‌ కేంద్రంలో సరైన వసతులు లేకపోవడంతో ఎండవేడిమికి తట్టుకోలేక దళిత మహిళ తిమ్మిలమ్మ ఓటర్ల పక్కన కూర్చుని ఉండడంతో ఆగ్రహించిన  ఎస్‌ఐ శ్రీనివాసులు లాఠీతో ఆమెను చితకబాదారు.

దీంతో ఆమె కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు మహిళలు, యువకులకు కూడ గాయపడ్డారు. దీనిపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు.  ఇది తెలుసుకుని అక్కడికి వెళ్లిన వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై కూడ ఎస్‌ఐ చెయ్యి చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులను పరామర్శించి, ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దాష్టీకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చే శారు. దళిత మహిళలపై దాడి చేయడం, తప్పుడు కేసులు బనాయించడంపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు