విద్యార్థి ఆచూకీ లభ్యం

9 Aug, 2019 14:34 IST|Sakshi

అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులు

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన విద్యార్థి ధనుష్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో ఉన్న పొదల్లో కొన ఊపిరితో ఉన్న ధనుష్‌ను పోలీసులు గుర్తించారు. తలకు బలమైన గాయం కావడంతో కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధనుష్‌ చిన్నాన్నతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గురువారం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని అపహరించి హత్య చేసేందుకే తలపై కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు