‘అక్షరం’రాలే..!

26 Dec, 2017 12:58 IST|Sakshi

లక్ష్యానికి దూరంగా  సాక్షర భారత్‌

31తో ముగియనున్న పథకం గడువు

కొనసాగింపుపై స్పష్టతలేదు

ఆరిపోనున్న ‘అక్షరదీపాలు’..

ఐదేళ్లు కొనసాగించాలి : ఎంపీ వినోద్‌కుమార్‌

జిల్లావ్యాప్తంగా 211     కేంద్రాలు మూసివేతే?

వయోజనులకు అక్షరాలు నేర్పించే సాక్షరభారత్‌ కేంద్రాల మూసివేత తప్పదా? సంపూర్ణ అక్ష్యరాస్యత సాధన కోసం 2010 సెప్టెంబర్‌ 8న కేంద్రప్రభుత్వం ప్రారంభించిన సాక్షరభారత్‌ మిషన్‌ గడువు 2015తోనే ముగిసింది. నిర్దేశిత లక్ష్యం సాధించలేదనే కారణంతో గతరెండేళ్లలో మూడుసార్లు దీని కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మరో ఐదురోజులే గడువు ఉండడంతో సర్కారు నేటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఈనెల 31 తర్వాత అభ్యసన కేంద్రాల భవిష్యత్‌ ఏమిటనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

సిరిసిల్ల: వేలిముద్రవేసే వారికి అక్షరాలు నేర్పించి అక్షరాస్యులగా తీర్చిదిద్దడమే సాక్షర భారత్‌ లక్ష్యం. 2009 సెప్టెంబరు 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సాక్షర భారత్‌ పథకం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో 2010 సెప్టెంబర్‌ 8న అభ్యసన కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో గ్రామానికోటి చొప్పున 211 కేంద్రాలను నెలకొ ల్పారు. వీటి ద్వారా చదువుకున్న వయోజనులకు వి ద్యను నిరంతరం అందించడం, దినపత్రికలు, కథల పుస్తకాలు అందించి చదువు కొనసాగించడం ముఖ్య ఉద్దేశం. చదువురాని వారికి అక్షరాలు నేర్పించాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, సాక్షర భారత్‌ గ్రామ కో ఆర్డినేటర్ల అలసత్వంతో కేంద్రాలు మొక్కుబడిగానే సాగుతున్నా యి. ప్రతీ గ్రామంలో ఇద్దరు కో ఆర్డినేటర్లను నియమించారు. వీరికి నెలకు రూ.2000 వేతనం చెల్లిస్తున్నారు. మండలస్థాయిలో కో ఆర్డినేటర్లకు రూ.6000 వేతనం అందిస్తున్నారు. అయితే, 15 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

కొనసాగింపుపై సందిగ్ధం..!
సాక్షర భారత్‌ కొనసాగింపుపై సందిగ్ధం ఉంది. దీని స్థానంలో కొత్త పథకం ప్రారంభించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. వేతనాలు పెంచి సమర్ధవంతంగా పథకం నిర్వహించాలని భా విస్తున్నా.. ఎంత వేతనం ఇవ్వాలనే అంశంపై స్పష్టత లేదు. కొత్తజిల్లాలు ఏర్పాటైనా ఉమ్మడి జిల్లాలోనే నే టికీ ఈ పథకం నిర్వహణ సాగుతోంది. కొత్త మండలాల్లోనూ కేంద్రాల విభజన జరగలేదు. జెడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన, వయోజన విద్య డెప్యూటీ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఉండగా.. కొత్త జిల్లాలో పర్యవేక్షణ క రువైంది. వయోజనులు చదువుకునే సామాగ్రి కూడా సరఫరా కాలేదు. జిల్లాకు సూపర్‌వైజర్‌ రాంరెడ్డి  వ్య వహరిస్తున్నా.. ఆయనఒక్కడే ఉండడంతో పనిఒత్తిడి పెరిగింది. జిల్లాలో ఆరు నెలలకోసారి ప్రారంభించా ల్సిన స్కీం(కొత్త బ్యాచ్‌)ల విషయంలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. నిజానికి జీతాలు సరిగా.. ఇవ్వకపోవడం.. పర్యవేక్షణ లోపంతో మొక్కు‘బడి’గా మారింది. కానీ చిత్తశుద్ధితో పనిచేస్తే.. క్షేత్రస్థాయిలో మంచిఫలితాలు రానున్నాయి.

మరిన్ని వార్తలు